calender_icon.png 14 October, 2025 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరగాలి

14-10-2025 12:00:00 AM

తాడ్వాయి, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరగాలని తాడువాయి ఎంపీడీవో సాజిద్ అలీ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలనిt సూచించారు. నిర్మాణాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.