14-10-2025 12:00:00 AM
ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): పోలీస్ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బిబిపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ లతో మాట్లాడారు. విధులను నిర్లక్ష్యం చేయకుండా విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ పరేడ్ను స్వీకరించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్ ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. నైపుణ్యంతో సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉందన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వివరించాలని సూచించారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించి తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
బ్లూ కోర్ట్ పెట్రో కార్ సిబ్బంది విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద చర్యలపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అనుమానితుల ప్రతి కదలికపై నిగా పెట్టాలని సూచించారు. ఎస్పీ రాజేష్ చంద్రన్న తో పాటు కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.