14-10-2025 12:00:00 AM
పరిష్కారానికి సంబంధిత పోలీసులకు సీపీ ఆదేశాలు
నిజామాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య నిర్వహించే పోలీస్ ప్రజావాణి కి 20 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ఫిర్యాదు దారుల నుండి 20 ఫిర్యాదులను సిపి స్వీకరించారు.
ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు.