calender_icon.png 28 October, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరగాలి

28-10-2025 06:27:49 PM

తాడ్వాయి (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరగాలని మండల ప్రత్యేక అధికారి రఘునందన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్, తాడ్వాయి గ్రామాలలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వేగవంతంగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, అధికారులు పాల్గొన్నారు.