28-10-2025 08:31:27 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నూతనంగా తహెరా బేగం నియమితులయ్యారు. నూతనంగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈ రోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలను త్వరలోనే సందర్శించి గ్రామాల సమస్యలను పరిష్కరించే విధంగా, మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిచే విధంగా తన వంతు సహకారం ఇస్తానని మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పుష్పగుచంతో ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ ప్రకాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.