calender_icon.png 28 October, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీపక్‌ రెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

28-10-2025 08:17:06 PM

తుర్కయంజాల్‌: జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి దూసుకెళ్తున్నారు. ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా రహమత్‌ నగర్‌ డివిజన్‌లోని శ్రీరాంనగర్‌ కాలనీలో రంగారెడ్డి జిల్లా బీజేపీ సీనియర్‌ నాయకులు కందాల బలదేవరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

దేశంలో ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన సంక్షేమ పథకాలే దీపక్‌ రెడ్డిని గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత నరేంద్రమోదీపై, బీజేపీపై ప్రజల్లో ఎనలేని అభిమానం చోటుచేసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకులు బొడిగె రమాదేవి, ముత్యమమ్మ యాదవ్‌, బీజేపీ తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శులు నందగిరి సురేష్‌ గౌడ్‌, కొలను రవీందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.