28-10-2025 08:23:19 PM
నిర్మల్ రూరల్: మామడ మండలంలోని బూరుగుపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం బైక్ పై వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోగా వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని వివరాల కోసం ఆరాధిస్తున్నారు. బైక్ నెంబర్ ఆధారంగా వివరణ సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.