calender_icon.png 28 October, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటుకు ఎమ్మెల్యే విజ్ఞప్తి

28-10-2025 08:43:06 PM

ఎల్లారెడ్డిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటుకు టిజిఎస్ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు విజ్ఞప్తి.. 

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపోని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం టిజిఎస్ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డిని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కలిసి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో బస్ డిపో ఆవశ్యకతను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామీణ ప్రాంతాలకు నేటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరిన్ని కొత్త బస్సులను కేటాయించాలని కోరారు.

ఎల్లారెడ్డి ప్రజల రవాణా అవసరాల దృష్ట్యా నూతన ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరారు. డిపో ఏర్పాటు కు అనువైన 5 ఎకరాల స్థలం సైతం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కాగా ఇటీవల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 10 నూతన బస్సులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఎండి నాగిరెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.