calender_icon.png 28 October, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి

28-10-2025 08:48:06 PM

- ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కందడి శ్రీరామ్

- ఇబ్రహీంపట్నంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో మహాధర్నా 

ఇబ్రహీంపట్నం: పెండింగ్ లో ఉన్న 8100 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలనీ ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కందడి శ్రీరామ్ అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కందడి శ్రీరామ్ మాట్లాడుతూ... సంవత్సరాల తరబడి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయని కారణంగా, దాదాపు రూ. 8100 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పెండింగ్ లో ఉన్నాయని, నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావొస్తున్న పెండింగ్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యల చేస్తూ పేద విద్యార్థుల జీవితాల పట్ల శాపంగా మారారని మండిపడ్డాడు.

పేద విద్యార్థులకు సంజీవని వంటి ఫీజు రియంబన్మెంట్, స్కాలర్షిప్ పధకానికి తూట్లు పొడుస్తూ విద్యార్థుల హక్కు అయిన ఫీజు రియంబర్స్మెంట్ లను విడుదల చేయకపోవడం అనేది పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే దిశగా ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ వీర పట్నం జిల్లా కన్వీనర్ పయ్యంశెట్టి జగదీష్, ఏబీవీపీ లా స్టూడెంట్స్ పురం కన్వీనర్ మల్లకేడి సాయి చరణ్, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ శివ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.