calender_icon.png 28 October, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రగతి భవన్ ముట్టడిస్తాం

28-10-2025 06:24:18 PM

రీయంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేకుంటే ప్రగతిభవన్లో ముట్టడిస్తామని బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో నీల నాగరాజు మాట్లాడుతూ ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు విడుదలలో జాప్యం వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత 4 సంవత్సరాలుగా నిర్ణీత సమయానికి స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు బంద్ పాటిస్తామని చెప్పడంతో విద్యార్థులంతా తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారన్నారు. 

ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి దశల వారీగా 1200 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని మాట ఇచ్చి కూడా తప్పడంతో యాజమాన్యాలు సమ్మెకు దిగడంతో బడుగు ,బలహీనవర్గాల విద్యార్థులు చదువుపై శ్రద్ద పెట్టలేక, పై చదువులు ఎలా సాగుతాయోనాన్న భయాందోళనకు గురవుతున్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులపై చదువులు, ఉద్యోగాల నిమిత్తం సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు వెళ్తే ఫీజు బకాయిలు రానందున విద్యార్థులే ఫీజు చెల్లించి తమ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని షరతులు విధించడంతో దిక్కుతోచని స్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని లేని పక్షంలో లక్షలాది మంది విద్యార్థులతో ప్రగతి భవన్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.దయాకర్, మహేష్,నరేష్, రాము,జీవన్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.