calender_icon.png 1 May, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది పరీక్షల్లో ఇంగ్లిష్ యూనియన్ హై స్కూల్‌లో వంద శాతం ఉత్తీర్ణత

01-05-2025 01:08:18 AM

తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి

ముషీరాబాద్ ఏప్రిల్ 30 (విజయక్రాంతి): కవాడీగూడలోని ఇంగ్లిష్ యూని యన్ హై స్కూల్ విద్యార్థులు పదోవ తరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులి గారి గోవర్ధన్ రెడ్డి, స్కూల్ ప్రిన్సిపాల్ పీ స్వర్ణలత పేర్కొన్నారు.

ఈ మేరకు బుధవారం కవాడీగూడలోని ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్లో వా రు మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలో  మొత్తం 183 మంది విద్యార్థులు పది పరీక్షలు రాశారని, అందులో 91 మంది బాలిక లు, 92 మంది బాలురు నూటికి నూరు శా తం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు చక్కని ఫలితాలు సాధించారని కొనియాడారు. విద్యార్థులు ఇష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలి పారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను, విద్యార్థులను పాఠశాల ప్రిన్సి పాల్ వీరు అభినందించారు.