13-10-2025 12:34:40 AM
నిజామాబాద్ అక్టోబర్ 12 (విజయ క్రాంతి): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మీ తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆదివారం పరామర్శించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు భూపతిరెడ్డి మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీ నరసమ్మ మరణించిన విషయం విధితమే.
వివేక్ వెంకటస్వామి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు భూపతిరెడ్డి ని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు భూపతి రెడ్డి మాతృమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వీరితోపాటు తెలంగాణ కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ పిసిసి అధికార ప్రతినిధి వేణు యాదవ్ డిసిసి ప్రధాన కార్యదర్శి భాస్కర్ భోజన్న ఉమ్మాజీ నరేష్ బాగా రెడ్డి ఇతరులు ఉన్నారు.