13-10-2025 12:34:45 AM
-రాజ్యాంగ సమాన న్యాయం సిద్ధాంతానికి కఠిన పరీక్ష
-సీనియర్ న్యాయవాది, సత్యనారాయణ గుండ్లపల్లి
హైదరాబాద్, అక్టోబర్ 12: భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పించాలనే లక్ష్యంతో రూపొందించబడిందని, రాజ్యాంగంలోని అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4), 243డీ, 243టీ ద్వారా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రిజర్వేషన్లు అనుమతించినప్పటికీ,ఇవి ‘సమాన అవకాశాలు కల్పిం చటానికి మాత్రమే‘ పరిమితం చేయబడ్డాయని సీనియర్ న్యాయవాది సత్యనారా య ణ గుండ్లపల్లి అభిప్రాయం వ్యక్తం చేశా రు.
ఇప్పుడున్న తెలంగాణా పరిణామాలు ఈ సూత్రాల ప్రాక్టికల్ పరిమితులను మరోసారి వెలుగులోకి తెచ్చాయన్నారు. తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పి స్తూ జీవో నంబర్ 9 జారీ చేసిందని, దీనిపై కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారన్నారు. పిటిషనర్ల వాద న ప్రకారం సుప్రీం కోర్టు ఇంద్రసాహ్ని (1992) తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్ 50% దాటరాదు.
తె లంగాణ ప్రభుత్వం ఇచ్చిన 42% రిజర్వేషన్ రాజ్యాం గ పరిమితిని ఉల్లంఘిస్తోందని, అందు కని హై కోర్టు, ఈ వాదనను పరిగణలోకి తీసుకుని ప్రాథమికంగా స్టే జారీ చేసింది అని పేర్కొన్నారు. అయి తే తెలంగాణ ప్రభుత్వ వాదన ప్రకారం, రాష్ట్రంలో బీసీల జనాభా 56.33% కంటే ఎక్కువ.అందువల్ల వారికీ 42% రిజర్వేషన్ సరైనదని ప్రభుత్వం భావించిందన్నారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నట్లు జనాభా ఆధారంగా రిజర్వేషన్ నిర్ణయించడం సరిపోదు.. సమా న అవకాశాల లోటును నిరూపించాలని అని ఆయన పేర్కొన్నారు.
దీంతో బీసీల రిజర్వేషన్ వాస్తవికంగా దామాషా ప్రాతిపదిక గా కాకుండా, చట్ట పరిమితుల బంధంలో చిక్కుకుపోయిందన్నారు. హైకోర్టు తీర్పు అనం తరం, తెలంగాణ బీసీ సంఘాలు, వివిధ సామాజిక సంస్థలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయని, వీరి వాదన ప్రకారం ఒకవైపు ఆర్ధిక స్థితిని ఆధారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శాతం ఇచ్చి 50 శాతం పరిమి తిని మించినప్పుడు బీసీలకు రిజర్వేషన్లు పెంచడం తప్పె లా అవుతుందని.. న్యాయపరంగా బీసీల కు దామాషా ఆధారంగా ప్రాతినిధ్యం తప్పనిసరి ఇవ్వాలంటున్నారు.
అయితే ఇప్ప టి పరిస్థితుల్లో ప్రభుత్వం హైకోర్టు స్టే పై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది అని సీనియర్ న్యాయవాది పేర్కొన్నారు. ఇక సుప్రీం కోర్టు ముందు ఈ కేసు వెళ్లినపుడు, ఇంద్రసాహ్ని తీర్పు పునర్వ్యాఖ్యానం జరిగే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. బీసీల రిజర్వేషన్ అనేది కేవలం రాజకీయ నిర్ణయం కాదు.. ఇది రాజ్యాంగ సమాన న్యాయం సిద్ధాంతానికి కఠిన పరీక్ష అని ఆయన పేర్కొన్నారు.
హైకోర్టు స్టే తీర్పు, తాత్కాలికంగా ఒక అడ్డంకి అయినా, ఇది భవిష్యత్తులో బీసీల హక్కుల పునర్నిర్వచనానికి బాట వేస్తుంది.దామాషా ప్రకారం వారి వాటికోసం న్యాయం పోరాటం మళ్లీ మొదలవుతోంది అని సీనియర్ న్యాయవాది, సత్యనారాయణ పేర్కొన్నారు.