04-07-2025 01:01:13 AM
లింగంపల్లిలో అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్
సదాశివనగర్, జులై 03(విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధియే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు.గురువారం సదాశివ నగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో రూపాయలు 2.40 కోట్ల నిధులతో మిషన్ భగీరథ బల్క్ నీటి కనెక్షన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ సకల సదుపాయాలతో TGIICని ఏర్పాటు చేసుకుంటున్నామని, ఇప్పటికే ఒక కంపెనీ ని తీసుకొచ్చా నని, అది కూడా వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది అని అన్నారు. మరిన్ని కంపెనీ లతో కూడా మాట్లాడుతున్నానని,ఈ కంపెనీ లు రావడం వల్ల మన నియోజకవర్గంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు. యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఎన్నో సార్లు జాబ్ మేళాలు పెట్టి యువతకు ఉపాధి కల్పించామని అని గుర్తు చేసారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు 23 కోట్ల నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ నిర్మాణ పనుల్లో భాగంగా భూంపల్లి, మోతే, కాటేవాడి జలశాల నిర్మాణాలకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో & చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడి అవసరమైన పెండింగ్ లో ఉన్న క్లీరెన్స్ చేపించి నట్టు వివరించారు. ఆర్ధిక శాఖ నుండి ఫైనల్ అప్రూవల్ వస్తే జలాశయాల నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయి అని రైతులకు తెలిపారు.
భూములు కొలిపోయిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా ప్రభత్వానితో మాట్లాడుతానని,రైతుల వివరాలు రిపోర్ట్ తయారు చేసి ఒక వారం రోజుల్లో అందించాలని తహసీల్దార్ సత్యనారాయణను ఆదేశించారు. కార్యక్రమంలో సదాశివనగర్ మండల అధ్యక్షులు, మిషన్ భగీరథ అధికారులు, మండల సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కమిటి సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.