04-07-2025 01:01:49 AM
కలెక్టర్కు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినతి
మేడ్చల్, జూలై 3(విజయ క్రాంతి): కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములు కాపాడి ప్రజావసరాలకు వినియోగించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం కలెక్టర్ మను చౌదరికి విన్నవించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ లో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ భూముల్లో అర్బన్ ప్రైమరీ సెంటర్లు, లైబ్రరీలు, విద్యాసంస్థలు వంటివి ఏర్పాటు చేయాలన్నారు.
భూదాన్ భూములు ఆట స్థలాలు, స్టేడియం కు ఉపయోగించాలన్నారు. అల్వాల్ జొన్న బండ ప్రాంతంలో 22, 23 సర్వే నంబర్లలో ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లను కొంతమంది కబ్జా చేసి అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. మచ్చ బొల్లారం హిందూ స్మశాన వాటిక కబ్జాకు గురవుతోందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడంలేదని తెలిపారు.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేనందున ఇబ్బంది అవుతోందని వెంటనే బలం కేటాయించాలని ఆయన కోరారు. మచ్చ బొల్లారం 91 సర్వే నంబర్ లో 50 గుంటల భూమి శ్రీ బాలాజీ రాధాకృష్ణ దేవాలయానికి చెందినదని, దీనిని లీజుకి ఇవ్వాలన్న ప్రతిపాదన విరమించుకొని కళ్యాణ మండపం నిర్మించాలని కోరారు.
నియోజకవర్గంలోని వివిధ సమస్యలను కలెక్టర్కు వివరించి పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు శాంతి శ్రీనివాసరెడ్డి, మేకల సునీత రాము యాదవ్, నాయకులు బద్ధం పరశురాం రెడ్డి, అనిల్ కిషోర్ గౌడ్, మేకల రాము యాదవ్, డోలి రమేష్, శోభన్ బాబు, ఉస్మాన్, మెమొరి శ్రీధర్ గౌడ్ తదితరులున్నారు.