calender_icon.png 18 November, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ పామ్ తో నిరంతర ఆదాయం!

18-11-2025 08:27:39 PM

జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ 

వరి పంట వ్యర్థాలను కాల్చొద్దు : దేవ్ కుమార్ జిల్లా వ్యవసాయ అధికారి.

కొల్చారం: ఒకసారి ఆయిల్ పామ్ మొక్కలు నాటితే నాలుగు సంవత్సరాల తర్వాత నుండి 50 సంవత్సరాల వరకు నిరంతర ఆదాయం రైతుకు లభిస్తుందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ అన్నారు. మంగళవారం రంగంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో సహకార సంఘం చైర్మన్ అరిగె రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఆయిల్ ఫామ్ అవగాహన సదస్సుకు జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ తో కలిసి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఆయిల్ ఫామ్ ఒక ఎకరం విస్తీర్ణంలో 57 మొక్కలు నాటవచ్చు అన్నారు.

ఈ మొక్కల ద్వారా మొక్క నాటిన నాలుగో సంవత్సరం నుండి ఎకరాకు 8 క్వింటాళ్ల  నుండి 10 క్వింటాల్ వరకు ఆయిల్ ఫామ్ గెలలు దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత ధర ప్రకారం ఎకరాకు 80 వేల రూపాయలు ఆదాయం రైతుకు వస్తుందన్నారు మొక్క నాటిన నాలుగు సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు నిరంతరాదాయం వస్తుందన్నారు. కోతుల బెడద అడవి పందుల బెడద ఆయిల్ ఫామ్ తోటలకు లేదన్నారు.

ఆయిల్ ఫామ్ మద్దతు ధరకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది అన్నారు. కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకు వచ్చింది అన్నారు. దళారులు లేకుండా నేరుగా కంపెనీల ప్రతినిధులు ఆయిల్ ఫామ్ గెలలు  కొనుగోలు చేస్తారని తెలిపారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో డ్రిప్పు పద్ధతి ద్వారా ఆయిల్ ఫామ్స్ సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు అని తెలిపారు. ఎవరైనా రైతులు ముందుకు వస్తే వారికి క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకెళ్లి ఆయిల్ ఫామ్ సాగుపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

వరి పంట వ్యర్థాలను కాల్చొద్దు : దేవ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి.

వరి పంట వ్యర్థాలను రైతులు కాల్చోద్దని వాటిని సేంద్రియ ఎరువుగా మారిస్తే భూసారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ అన్నారు. ఆయిల్ ఫామ్ తోటల సాగు పై అవగాహన సదస్సు హాజరైన ఆయన వారి వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే అనర్థాలను రైతులకు వివరించారు వరి వ్యర్థాలను ముక్కలుగా చేసి డికంపోస్టు చేయాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగు వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని పంట మార్పిడిపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రంగంపేట సహకార సంఘం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.