18-11-2025 08:24:35 PM
ఎంపీడీఓ సునీత
నూతనకల్: మండల పరిధిలోని పలు గ్రామాలలో మంగళవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ సునిత ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక నిర్మూలన ప్రతిజ్ఞను గ్రామ ప్రజలు, యువత, అంగన్వాడీ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది కలిసి చేశారు. ఈ సందర్బంగా ఆమె డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని అందరితో ప్రమాణం చేయించారు. అనంతరం ఎంపీపీఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను, బియ్యం నిల్వలను తనిఖీ చేశారు.
ఆహారం పరిశుభ్రంగా, పోషక విలువలతో ఉండాలని సూచించారు. నూతనకల్‌లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ స్థితిని, లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. అదేవిదంగా పెదనేమీల గ్రామ పంచాయతీలో కొత్తగా నిర్మిస్తున్న ఉప ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులను తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.