18-10-2025 04:29:20 PM
బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్
చిట్యాల: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకై శనివారం బీసీ సంఘాలు రాష్ట్ర బందుకు పిలుపునివ్వడంతో బీజేపీ మద్దతు తెలుపుతూ మండలంలోని పాఠశాలలను, వ్యాపార వాణిజ్య దుకాణాలను ఆయన బంధు చేయించారు. ఈ సందర్భంగా బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే విధంగా జీవో 9 తీసుకొచ్చిందన్నారు.
బీసీల సంక్షేమం కోసం అనుక్షణం పాటుపడేది బీజేపీ మాత్రమేనని, స్వార్థ రాజకీయాల కోసం బీసీలను ఉపయోగించుకునేది కాంగ్రెస్, బీఆర్ఎస్ అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మండల నాయకులు గుండ సురేష్, చెక్క నరసయ్య, రాయిని శ్రీనివాస్, మైదం శ్రీకాంత్, వల్లాల ప్రవీణ్, కేంసారపు ప్రభాకర్, చింతల రాజేందర్, ఉమ్మనని రాజేష్, కలవచర్ల కిషోర్, శ్రీహరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.