18-10-2025 04:26:00 PM
కాగజ్ నగర్ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ సహకారంతో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ సౌజన్యంతో కళాశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో శనివారం పర్యావరణ హిత వస్తు ప్రదర్శన ఘనంగా జరిగింది. కళాశాల విద్యార్థులు పర్యావరణ అనుకూల వస్తువులతో స్వయంగా తయారు చేసిన పలు రకాల వస్తువులను ప్రదర్శించారు. మొత్తం 18 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకి పర్యావరణ కాలుష్యం పెరిగిపోవడం వలన అనేక అనర్ధాలు సంభవిస్తున్నాయని కాబట్టి పర్యావరణానికి హాని కలిగించని వస్తువులు ఉపయోగించి విద్యార్థులు అనేక రకాల వస్తువులు తయారు చేసి ప్రదర్శించడం వలన ప్రతీ ఒక్కరికి పర్యావరణ పట్ల అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు.
ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె శ్రీదేవి మాట్లాడుతూ పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని ఉద్దేశంతో ఇలాంటి వినూత్న ప్రదర్శనను కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు కళాశాల ఎకో క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ వి దేవేందర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించని వస్తువులను ఉపయోగించి వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించడం ద్వారా విద్యార్థులతో పాటు ప్రజలకు కూడా పర్యావరణం పట్ల అవగాహన కల్పించే కృషి చేయడం జరిగిందని పేర్కొన్నారు.
విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి అనేక రకాల ఆరోగ్యకరమైన తినుబండారాలతో పాటు పరిసరాలలో లభించే వస్తువులను సేకరించి నూతన ఉత్పత్తులను తయారు చేసి ప్రదర్శించడం పలువురిని ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనను ప్రభుత్వ జూనియర్ కళాశాల, నవోదయ అధ్యాపకులు, విద్యార్థులు సైతం సందర్శించి విద్యార్థులు తయారు చేసిన పలు రకాల వస్తువులను కొనుగోలు చేసి విద్యార్థుల కృషిని ప్రశంసించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. డి లక్ష్మీనరసింహం కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ డి జనార్దన్, అధ్యాపకులు ఎం రాజేశ్వర్, బి వెంకటేశం, ఎస్ వెంకటేశ్వర్లు టి, దత్తాత్రేయ రోజ్ మేరీ,కృష్ణవేణి డాక్టర్ టేమాజీ పాల్గొన్నారు.