calender_icon.png 19 October, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేకులపల్లిలో బీసీ బంద్ సంపూర్ణం

18-10-2025 04:31:12 PM

అన్ని పార్టీలు, కులసంఘాల మద్దతు..

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో శనివారం బీసీ బంద్ సంపూర్నంగ జరిగింది. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం రెండింటి వరకు ఒక్క దుకాణం కూడా తెరవలేదు. ప్రతి శనివారం నిర్వహించే సంత కూడా పూర్తిగా నిలిచి పోవడం విశేషం. అధికార కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సిపిఐ, సిపీఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజాపందా, సిపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి, తెలంగాణ ప్రజా ఫ్రాంట్, ఎమ్మార్ పీఎస్, సేవాలాల్ సేన, ఎల్ హెచ్ పీఎస్ తదితర పార్టీలు, కులసంఘాలతో పాటు, బీసీ కులసంఘాల నాయకులూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదట బస్టాండ్ సెంటర్ లో గంట పాటు రాస్తారోకో నిర్వహించి అక్కడి నుంచి బోడు క్రాస్ రోడ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.

సమావేశం నిర్వహించి నాయకులందరూ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, బేతంపూడి పీఏసిఎస్ అధ్యక్షుడు లక్కినేని సురేందర్ రావు, కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, అన్ని పార్టీల నాయకులూ బంద్ లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై రాజేందర్, పోలీస్ సిబ్బందితో బందోబస్త్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, ప్రవేటు వాహనాలు, ఆటోలు, తిరగక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంద్ తో తాగు నీరు కూడా లభించక పోవడంతో మండుతున్న ఎండలో ప్రయాణికులు అతలాకుతలం అయ్యారు.