calender_icon.png 21 May, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో దేశం అభివృద్ధికీ దోహదం..

19-04-2025 10:23:51 PM

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్..

'ఒకే దేశం ఒకే ఎన్నిక' పై నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవగాహన సదస్సు..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశం అభివృద్ధికీ దోహదం చేస్తుందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రగతినగర్ శ్రీకృష్ణ గార్డెన్ లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశంపై శనివారం మేడ్చల్ అర్బన్ జిల్లా ఇన్చార్జి అధ్యక్షులు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి అధ్యక్షతన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాలలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాలసీ ఉందని అన్నారు.

ఇలాంటి నిర్ణయం వల్ల పాలనలో నిరంతరాయత్వాన్ని ప్రోత్సహించడం, విధాన నిర్ణయాల్లో జాప్యాలను నివారించడం, వనరులను వేరువేరు చోట్ల ఉపయోగించాల్సిన అవసరం తగ్గించడం, ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యతను పరిరక్షించడం,రాజకీయ అవకాశాలు పెంపొందించడం, పరిపాలనపై దృష్టిని కేంద్రీకరించడం,ఆర్థిక భారం తగ్గడం వంటి దేశ ప్రయోజనాలపైనే కాకుండా వన్ నేషన్ వన్  ఎలక్షన్ అనేది దేశంలో ఎన్నికల ఖర్చులను తగ్గించాలని లక్ష్యంతో దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ను  పార్లమెంట్లో ప్రవేశపెట్టడం దానికి దాదాపు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయడం జరిగిందని అన్నారు.దేశంలో 1952, 57, 62, 67 సంవత్సరాల్లో నాలుగు సార్లు పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని,జమిలి ఎన్నికలు మనకు కొత్తకాదు అని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

ఈ జమిలి ఎన్నికల విధానం ప్రపంచ దేశాలైన  స్వీడన్ ,జర్మనీ వంటి దేశాలలో జమిలీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని వన్నెషన్ వన్ ఎలక్షన్ నిర్వహించడం వలన లక్షల కోట్ల ప్రజాధనం వృధా కాకుండా కాపాడడమే కాకుండా ప్రజల మరియు అధికారుల సమయ భారాన్ని కూడా తగ్గించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కార్యదర్శి  కొల్లి మాధవి, జయశ్రీ జిల్లా కార్యదర్శులు గిరివర్ధన్ రెడ్డి,విగ్నేశ్వర చారి, దుండిగల్ మున్సిపల్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి,స్థానిక బీజేపీ అధ్యక్షులు నరేంద్ర చౌదరి, ప్రసాద్ రాజు, బిక్షపతి యాదవ్, నిజాంపేట కార్పొరేషన్ బీజేపీ నాయకులు విజయలక్ష్మి సుబ్బారావు, సుమన్ రావు, డాక్టర్ రాజు, చక్రధర్, సుబ్బారావు, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని వివిధ వృత్తులకు సంబంధించిన మేధావులు, వివిధ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.