21-05-2025 03:55:29 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో బుధవారం ఎస్పీ డివి శ్రీనివాస రావు కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర, ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీనీ సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందించారు. భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు ను శాలువా తో సన్మానించి, సరస్వతి దేవి ఫోటో బహుకరించారు.