21-05-2025 03:51:12 PM
ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, మండల అధ్యక్షులు పులి సైదులు, పట్టణ కార్యదర్శి జాఫర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయవాది సూర్నపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.