19-04-2025 10:20:52 PM
క్లాస్మేట్ కూతురి వివాహానికి రూ. 56 వేలు అందించిన మిత్రులు
మహబూబాబాద్ (విజయక్రాంతి): పదో తరగతి వరకు తమతో కలిసి చదువుకున్న క్లాస్మేట్ ఆరేండ్ల క్రితం మృత్యువాత పడగా అతని కూతురు వివాహానికి పూర్వ మిత్రులంతా కలిసి 56 వేల రూపాయలను అందజేసి స్నేహానికి నిర్వచనం చాటారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని మోదుగుల గూడెం పాఠశాలలో 2000 2001 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు వివిధ రంగాలలో స్థిర పడ్డారు. తోటి స్నేహితుడు బేగవత్ బాలాజీ ఆరేండ్ల క్రితం బేగవత్ తండాలో బాలాజీ కూతురు స్వాతి - బాలాజీ వివాహానికి 96 మంది పూర్వ విద్యార్థులు తన సొంత కూతురుల భావించి మేమందరం నీకు అండగా ఉన్నామంటూ ఉన్నామంటూ 56 వేల రూపాయలు స్వాతి-బాలాజీ పెళ్లి ఖర్చులకోసం అందజేశారు.
మంచితనం మానవత్వం విలువలు కోల్పోతున్న ప్రస్తుత సమాజంలో తమతో చదువుకున్నాడని స్నేహితున్ని గుర్తు చేసుకొని ఆర్థికంగా అండగా నిలిచి స్నేహానికి నిర్వచనం చాటారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధరవత్ సుందర్ నాయక్, దేవనబోయిన వీరేష్, కొత్త శ్రీనివాస్, వల్లపు యాకన్న, రాసాల రమేష్, ఓ.వీరన్న, ఎస్. డి.దస్తగిరి పాషా, డి.రవీందర్, డి.శంకర్, కే.సరస్వతి, ఉపేంద్ర, ఉమా, ఎన్.సత్యవతి పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.