calender_icon.png 21 May, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జులై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

21-05-2025 03:46:13 PM

సీఐటీయు వ్యకస సంఘాల పిలువు

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంలో సిఐటీయు వ్యకస సంఘాల ఆధ్వర్యంలో జులై 9న జరిగే  దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని "సన్నాహక సదస్సు" కామ్రేడ్ ఎస్. శోభ బుధవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ... కేంద్రంలో మూడోవ సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తుందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కొడ్స్ ముందుకు తెచ్చిందన్నారు.

సామజిక సంక్షేమనికి కోతలు పెట్టి సామాన్యులపై భారలు మోపి, కార్పొరేట్ గుత్త సంస్థలకు, పెట్టుబడిదారులకు వేల కోట్ల రాయితీలు ప్రకటించి ఉపాధి నిరుద్యోగం అధిక ధరలు ఆకలి అసమానతలు ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోక ఈ సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చే ఆర్థిక విధానాలను విచక్షణరహితంగా అమలు చేస్తుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి కొట్టెందుకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, జులై 9న దేశ వ్యాప్త సార్వాత్రిక సమ్మె చేయాలని నిర్ణయించారు. కావున కార్మికుల హక్కులను  కాపాడుకోవడం కోసం కార్మికులు, రైతులు, ప్రజలు అందరు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజా సంఘలు పిలిపునిచ్చాయి. ఈ సదస్సులో ఎల్లయ్య, సునీత, పోశం, పోసవ్వ, రాణి, కవిత, మానస, పద్మ, అపర్ణ, హైమావతి, రమేష్, మహేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.