21-05-2025 03:31:55 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): దేశంలో సాంకేతిక విప్లవానికి ఆద్యుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు పలువురు వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం ఖానాపూర్ కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డు వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాజీ వైస్ చైర్మన్ కావలి సంతోష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మజీద్ ,నాయకులు యూసుఫ్ ఖాన్ ,తోట సత్యం, గంగ నరసయ్య, నయీమ్, షబ్బీర్ భాష, షౌకత్ పాషా, కిషోర్ నాయక్, రాస మల్ల అశోక్ ,జహీర్, బాణావత్ గోవింద నాయక్, తదితరులు ఉన్నారు.