calender_icon.png 1 January, 2026 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ల జాబితాకు సహకరించాలి

01-01-2026 01:30:10 AM

కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, డిసెంబర్31 (విజయక్రాంతి): మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల వారీ ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతిని ధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, లోపాలు లేకుండా నిర్వహించడమే ముఖ్య లక్ష్యమని తెలిపారు. మున్సిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వారీ ముసాయిదా ఓటర్ల జాబితా జనవరి 1వ తేదీన సంబంధిత నోటీ సు బోర్డులపై ప్రచురించడం జరుగుతుందని వివరించారు.

జాబితాలో పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు, అభ్యంతరాలు ఉంటే, నిబంధనల ప్రకారం సకాలం లో సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు లేదా జిల్లా అధికారులకు సమర్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. వారి ద్వారా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీల పోలింగ్ స్టేషన్ల వారీ తుది ఓటర్ల జాబితాను 2026 జనవరి 10వ తేదీన ప్రచురించనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియ సజావు గా సాగేందుకు, సమగ్ర ఓటర్ల జాబితారూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధు లు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అప్పల గణేష్, శ్రావణ్ రెడ్డి, అజంబిన్ యహీయా, రాము, సయ్యద్ హైదర్, నాందేడపు చిన్ను, భరత్వి, జయ్, మజార్, వినోద్ పాల్గొన్నారు.