calender_icon.png 4 May, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత చదువులకు పటిష్ట చర్యలు తీసుకోవాలి

03-05-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, మే 2(విజయక్రాంతి) : పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను పై తరగతులకు జాయిన్ అయ్యే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల విద్యాశాఖ అధికారులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ వీడి యో కాన్ఫరెన్స్లో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా ప్రమాణాలు మెరుగు పడుతున్నాయన్నారు. పదవ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా ఎంఈఓ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాలు.

ఈ విద్యా సంవత్సరం మెరుగుకు సలహాలు సూచనలు అందించారు. పదో తరగతి పాసైన విద్యార్థినీ విద్యార్థులను తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లో జాయి న్ చేయాలని, అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వారిని డిగ్రీ చదివేలా తల్లిదండ్రులతో సమన్వయం చేయాలని సూచించారు.

ఏ ఒక్క విద్యార్థి డ్రాప్ అవుట్ కాకుండాఉన్నత చదువులు చదివేలా కృషి పనిచేయాలని ఎంఈఓలకు, ప్రిన్సిపల్స్ కు కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ అధికారి మాధవి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి, గణాంక అధికారి నవీన్, సంబంధిత ఎంఈఓ లు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు.