calender_icon.png 4 May, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులు ఆయుధ నైపుణ్యం పెంచుకోవాలి

03-05-2025 12:00:00 AM

ఐజీ చంద్రశేఖర్రెడ్డి

మెదక్, మే 2(విజయక్రాంతి) : పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు ఆయుధ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఐజీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. శుక్రవారం మెదక్ లోని ఫైరింగ్ రేంజ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విధి నిర్వహణలో భాగంగా పోలీస్ సిబ్బందికి ప్రతి సంవత్సరం ఫైరింగ్ ప్రాక్టీస్ ఉంటుందన్నారు.

దానిలో బాగంగా మెదక్ సిబ్బంది  ఫైరింగ్ చేయుటకు సిద్దిపేట జిల్లాలోని రాజగోపాల్పేట వద్ద ఉన్న ఫైరింగ్ రేంజ్లో ప్రాక్టీస్ కు వెళ్లేవారని అన్నారు. ప్రస్తుతం మెదక్లోనే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డిని అభినందించారు. 

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక శ్రద్ధ వహించి పోలీస్ సిబ్బందికి ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు భూమిని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫైరింగ్ రేంజ్ లో రేంజ్ డిసిప్లేన్ పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్, మెదక్ డీయస్పీలు ఎస్.వెంకట్ రెడ్డి, ప్రసన్న కుమార్, సీఐలు, ఎసై లు, రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.