16-07-2025 01:02:08 AM
-ఐక్యత చాటని నేతలతో కార్యకర్తల అయోమయం
-సంస్థాగత పదవుల బాధ్యతపై నీలి నీడలు
-ఎవరికి వారే సమావేశాలు..
నిర్మల్, జూలై 1౫ (విజయక్రాంతి) : జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగుల వెతికి అని చెందగా మారింది. పదేళ్ల తర్వాత అధికారుల్లోకి వచ్చామన్న వృత్తి తప్ప క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేసే పార్టీ నేతలకు సీనియర్ కార్యకర్తలకు గుర్తింపు కరువైపోవడంతో కరువైపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్న వచ్చిన ప్రజాప్రతినిధులకు పార్టీ పదవులను కట్టెపుతున్న పార్టీ అధిష్టానం సీనియర్ నేతల విషయంలో నిర్లక్ష్యం వహించడంతో వారు పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రధాన నేతల మధ్య సైక్యత లేకపోవడమే కారణమని పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగినప్పటికీ నిర్మల్ నియోజకవర్గం అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ రావు ఓడిపోవడం జరిగింది. ఎన్నికలు బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించగా టిఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
అయితే నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐకి రెడ్డి ప్రాబల్యం ప్రాధాన్యతలతో ఉండడంతో వారు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో కాంగ్రెస్లో రెండు గ్రూపులు తయారయ్యాయి. ఒక వర్గానికి శ్రీహర్రావు నాయకత్వం వ్యక్తులుగా మరో వర్గానికి ఐకి రెడ్డి నాయకత్వం వహిస్తూ పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారే నిర్వహించడంతో పార్టీ కోసం కష్టపడుతున్న సీనియర్ నేతలు ఎవరి కార్యక్రమాలో పాల్గొనాలో అర్థం కాక తల లు పట్టుకుంటున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో మరో ఇద్దరు నేతలు మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ జెడ్పిటి సభ్యుడు పత్తిరెడ్డి రాజశేఖర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమత్ అలీ ఇలా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో వేరువేరు కుంపట్లు పెట్టుకొని తన రాజకీయ ప్రాబలం తగ్గిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.
పార్టీ ద్వారా నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నప్పటికీ తర్వాత మాత్రం ఎవరికి వారి తన కార్యచరణను అమలు చేసు కుంటున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశాలు ఒక వర్గంపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం వరకు వెళ్లడంతో పోలీస్ పహా ర మధ్య సమావేశాలు నిర్వహించుకుని సం స్థ గత పదవులపై ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకున్నారు. సంస్థ గత పదవుల అభిప్రాయ సేకరణలో అప్పాల గణేష్ చక్రవర్తి వర్గంతో పాటు శ్రీ ఆర్ రావు వర్గానికి చెంది న ముఖ్య నాయకులు డుమ్మా కొట్టడంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ హాట్ గా మారింది.
ఆ సమావేశాలకు తమను ఆహ్వానించకపోవడం వలన ఆయన వర్గీలతో పేర్కొన్నట్టు సమాచారం. అదే రోజు అప్పల గణేష్ చక్రవర్తి ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వ హించి ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యా దు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి తోడు మాజీ మంత్రి వేణుగో పాల చారి కూడా నిర్మల్ పై ప్రత్యేక దృష్టి పెట్టి తరచుగా పర్యటన చేయడంతో ఈయ న అంటూ ఒక వర్గం కూడా చాప కింద నీరులా తయారవుతుందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి
సంస్థ గత పదవులపై కుదరని అభిప్రాయం
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థల సంస్థ గత పదవులు ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామ మండల, పట్టణ బ్లాక్ కమిటీ నియోజకవర్గ ఇన్చార్జిలు కాంగ్రెస్ అనుబంధాల కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉన్న కమిటీల ఏర్పాటుపై ముఖ్య నేతలందరూ కూడా తాము చెప్పిన పేర్లను పరిగణలోకి తీసుకోవాలని పార్టీ ఇంచార్జ్ లపై ఒత్తిడి తేవడంతో పదవుల ఎంపిక కొలిక్కి రాకుండా పోతుంది.
పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జులు ఇటీవల నిర్మల సమావేశం నిర్వహించి పార్టీ కోసం కష్టపడిన నేతల పేర్లను వారి అభిప్రాయాలను కార్యకర్తలు సూచనలను తీసుకున్నప్పటికీ ఎంపిక ప్రక్రియ పై ఇంకా స్పష్టత రాకపోవడంపై పార్టీ పదవులు ఆశిస్తున్న సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు. సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ జిల్లా పరిషత్ ఎన్నికల పై ప్రభుత్వం కసరస్తు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాలకు పట్టణాలకు కన్వీనర్ల నియామకం చేపట్టి బ్లాక్ స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్స్థాయిలో పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించినట్లయితే పార్టీకి ప్రయోజ నకరంగా ఉంటుందని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే అనేకమంది వారి ప్రాంతాల్లో మద్దతును కూడా పట్టుకునేందుకు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ప్రయత్నాలు ప్రారంభించారు.
అయితే పార్టీ అధిష్టానం కూడా మండల కన్వీనర్లు బ్లాక్ కన్వీనర్ లను పట్టణ కన్వీనర్లను నియోజకవర్లను కాంగ్రెస్ అనుబంధ సంఘాలను ఖరారు చేస్తే పార్టీకి బలం చేకూర్చడమే కాకుండా ఐక్యత ఏర్పడి భవిష్య త్తులో పార్టీకి లాభం జరుగుతుందని అంటున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులందరి మధ్య నాయకుల అందరి మధ్య ఉన్న వర్గ విభేదాలను రూపుమాపేందుకు చర్యలు తీసుకొని క్షేత్రస్థాయిలో సీనియర్ కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఇస్తేనే పార్టీకి పార్టీ నేతలకు ప్రయోజనకరంగా ఉంటుందని వారు అభిప్రాయ పడుతున్నారు. పార్టీలో సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నిజమైన కార్యకర్తలకు నేతలకు పదవులు ఇవ్వాలని సీనియర్ నేతలు కోరుతున్నారు