calender_icon.png 3 August, 2025 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ల సవరణపై రగడ

02-08-2025 12:00:00 AM

  1. పట్టువీడని విపక్షాలు
  2. ఉభయ సభలు సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 1: బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)పై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరోసారి రగడ మొదలైంది. నాలుగు రోజుల పాటు సజావుగా సాగిన పార్లమెంట్ శుక్రవారం మాత్రం ప్రతిపక్షాల నిరసనలతో స్తంభించింది. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ అటు లోక్‌సభ.. ఇటు రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు పలుమార్లు నిరసనలు వ్యక్తం చేయడంతో ఒక్క అంశంపై కూడా చర్చ జరగలేదు.

లోక్‌సభలో విపక్ష ఎంపీలు పలుమార్లు స్పీకర్ ఫోడియం వద్దకు వెళ్లి ఎస్‌ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ నిరసన తెలిపారు. దీంతో స్పీ కర్ ఓంబిర్లా సభను సోమవారానికి వాయి దా వేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు పె ద్దల సభ కూడా సజావుగా సాగలేదు. రాజ్యసభలోనూ నిరసనలు వ్యక్తమవడంతో ఎ లాంటి చర్చ లేకుండానే సభ వాయిదా పడింది.