calender_icon.png 4 August, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోహన్ భగవత్ అరెస్టుకు అప్పట్లో ఆదేశాలు వచ్చాయి

02-08-2025 12:00:00 AM

  1. మాజీ ఏటీఎస్ అధికారి మహబూబ్ ముజావ్
  2.   2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ సహా మరికొందరి పేర్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 1: మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను అరెస్ట్ చేయాలని తనకు అప్పట్లో ఆదేశాలు వచ్చినట్టు మాజీ ఏటీఎస్ (యాంటీ టెర్రిరిజమ్ స్వాడ్) అధికారి మహబూబ్ ముజావ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముజావ్ మాట్లాడుతూ.. కేసు దర్యాప్తునకు సంబంధి ంచి కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేయాల ని తనకు ఆదేశాలు వచ్చాయని తెలిపారు.

వారిలో రామ్ కల్సంగ్రా, సందీప్ దాంగే, ది లీప్ పాటిదార్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఉన్నారన్నారు. దే శంలో ఒక వర్గంలో ప్రభావమున్న వ్యక్తిని అ రెస్ట్ చేయడమంటే అది తనకు శక్తికి మిం చి ందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న పరమ్‌బీర్ సింగ్ సహా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.

వారి సూచనల ప్రకారం తనకు సాయం చే సేందుకు రాష్ట్రం నుంచి దాదాపు 10 మంది సిబ్బందిని సమకూర్చారన్నారని తెలిపారు.  కాగా కేసులో నిందితులందరినీ గురువారం ముంబైలోని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.