02-08-2025 12:00:00 AM
రోడ్డు మరమ్మతులే కారణమన్న అధికారులు
శ్రీనగర్, ఆగస్టు 1: భక్తుల భద్రతరిత్యా అమర్‌నాథ్ యాత్రను ఆగస్టు 3 వరకు రద్దు చేశారు. భక్తులు ప్రయాణించే రెండు మార్గాల్లో కొన్ని అత్యవసర మరమ్మతులు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల వల్ల అమర్‌నాథ్ యాత్రికులు ప్రయాణించే దారి పాడయినట్టు పేర్కొన్నారు. శుక్రవారం ఉద యం నుంచి యాత్రికులెవర్నీ పహ ల్గాం మార్గంలో పంపట్లేదు.
బల్తాల్ మార్గంలో యాత్రను అనుమతిస్తున్నట్టు మొదట తెలిపినా.. భారీ వర్షాల వల్ల తర్వాత ఈ మార్గంలో కూడా యాత్రను రద్దు చేసినట్టు ప్రకటించారు. దీంతో భక్తులు జమ్మూ లోని భగవతినగర్ బేస్ క్యాంపులోనే ఉన్నారు. ‘ఇటీవల కురిసిన భారీ వ ర్షాల వల్ల మార్గం పాడయింది. మరమ్మతుల కోసం అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశాం. యాత్రికుల భద్రతే మాకు ముఖ్యం’ అని కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమా ర్ బిధూరి తెలిపారు.