calender_icon.png 11 November, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకరించు లేదా.. సుంకం భరించు

28-01-2025 01:47:31 AM

* భారీ సుంకం విధింపుతో వెనక్కి తగ్గిన కొలంబియా

* వలసదారులను వెనక్కి తీసుకొచ్చే నిబంధనలకు అంగీకారం

వాషింగ్టన్, జనవరి 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టి వారం కాకముందే ‘అమెరికా ఫస్ట్’ నినాదాన్ని అమలు చేసే పనిలో పడ్డారు. అమె రికాలో ఉన్న అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తూ, ప్రత్యేక విమానాల్లో వారిని స్వదేశాలకు పంపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చర్యలను ముందుగా వ్యతిరేకించిన కొలంబియా తర్వాత వెనక్కి తగ్గి అమెరికా పెట్టిన నిబంధనలకు అంగీకరించిందని వైట్‌హౌస్ పేర్కొంది.

కొలంబి యా వెనక్కి తగ్గి స్వదేశానికి తిరిగి వచ్చిన పౌరులను ఆహ్వానించడంతో తాము ఆ దేశంపై విధించిన సుంకాలు, పలు ఆంక్షలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. “అమెరికా సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి  అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా శ్రమి స్తున్నారు. యూఎస్‌లో చట్టవిరుద్ధంగా ఆశ్ర యం పొందుతున్న తమ పౌరులను వెనక్కి పిలిపించుకోవడానికి ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకుని మాకు సహకరించాలి” అంటూ వైట్‌హౌస్ ప్రకటిం చింది.

అమెరికాలోని వలసదారులను సైనిక విమానాల్లో పంపించడంపై పలు దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇదేక్రమంలో కొలంబియా కూడా సైనిక విమానాల్లో అవమానకరంగా వలసదారులను తీసుకొస్తే ఆ విమానాలను అనుమ తించేది లేదని తేల్చిచెప్పింది. ఆ విమానాలను దేశంలోకి ప్రవేశిం చకుండా నిషేధి స్తున్నానని ఇటీవలే కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో పేర్కొన్నారు.

వలసదారులను గౌరవంగా పంపించేందుకు అమెరికా నిబంధనలను రూపొం దిస్తేనే వాటిని అనుమతిస్తామని చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. కొలంబియా ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి పెంచు తున్నట్లు ప్రకటించారు. కొలంబియన్ ప్ర భుత్వ అధికారుల వీసాలను వెంటనే రద్దు చేస్తానని హెచ్చరించారు. 

ట్రంప్‌కు ఫోన్ చేసిన మోదీ.. 

భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేశారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.