28-01-2025 01:42:32 AM
న్యూఢిల్లీ, జనవరి 27: ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. పోర్టల్‌ను ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ఆవిష్కరించారు. ఉమ్మ డి పౌరస్మృతి ద్వారా పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తా మని వెల్లడించారు. ఇక లింగం, కులం లేదా మతం ఆధారంగా ఎటువంటి వివక్ష ఉండదన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.