18-10-2025 01:29:53 AM
- ప్రమాదల గురవుతున్న వాహనాచోదకులు
- రాత్రి సమయంలో మొక్కజొన్న పై బ్లాక్ టార్పోలిన్ కవర్లు
- ఇప్పటికే పలువురికి ప్రమాదాలు ఆస్పత్రిపాలు
- రోడ్డుపై మక్కలు పోస్తే చర్యలు తీసుకుంటాం : శేఖర్ రెడ్డి, ఎస్త్స్ర, మహమ్మాదాబాద్ మండలం
మహమ్మదాబాద్ అక్టోబర్ 17 : రోడ్లపై మొక్కజొన్న పంటలు ఏంటి అనుకుంటున్నారా... నిజమే పంట పొలాల్లో పండించిన మొక్కజొన్న పంట రోడ్లపై కి ఎక్కుతుంది. మహమ్మదాబాద్ మండల పరిధిలో ఎన్ హెచ్ 167 రోడ్డు పక్కనే ఉన్న సర్వీస్ రోడ్లపై కొందరు రైతులు పండించిన మొక్కజొన్న పంట రోడ్లపై ఆరబెడుతున్నారు. ఇక్కడ వర కు బాగానే ఉన్నప్పటికీ రాత్రి సమయంలో న లుపు రంగు గల టార్పలిన్ కవర్లను మొక్కజొన్నపై కప్పి పెడుతున్నారు.
రాత్రి స మయం కావడంతో కొంతమంది వాహనచోదకులు బ్లాక్ కవర్ కనిపించకపోవడంతో మొక్కజొన్న కుప్పలు కు తగిలి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటువంటి ఘటనలు మండల పరిధిలో ఇప్పటికే చోటుచేసుకుని ఆసుపత్రి పాలు అయ్యండ్రు. ఆరబెట్టెందుకు సర్వీస్ రేట్లను ఉపయోగించుకుంటున్న కొం తమంది రైతులు వారు వాహన చోదకులకు ఎంత మేరకు ఇబ్బందులు పెడుతున్నారో వారికి తెలియకుండానే ప్రమాదాలకు కారణమవుతున్నారు. వేగంగా వాహనాలు... అ సలే ఎన్ హెచ్ 167 రాత్రి సమయంలో వా హనాలు కొంత వేగం గానే ఉంటాయి.
ఈ తరుణంలో కొంత మేరకు పక్కకు జరిగిన ప లు ప్రాంతాలలో పక్కనే ఉన్న మొక్కజొన్న కుప్పలకు తలి తీవ్ర ప్రమాదాలు చోటు చే సుకుంటున్నాయి. వాహన చోదకులు మొరపెట్టుకుంటున్నప్పటికీ ఎవరికి చెప్పాలి ఎవ రు తీస్తారులే అనుకుంటూ లోలోపలనే మ దిన పడుతుండ్రు. మహబూబ్ నగర్ నుంచి తాండూర్, కోస్గి, చించోలి ముంబై తో పాటు పలు ప్రాంతాలకు ఈ రోడ్డు మీదుగా వాహనాలు వెళుతుంటాయి. ఎలాగైనా రైతులకు రోడ్లపై మొక్కజొన్నలు ఉంచకుండా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు చెబుతున్న మాట.
ఎవరు రోడ్లపై ధాన్యం పోయకూడదు...
ఎట్టి పరిస్థితుల్లో వాహన చోదకులకు ఇబ్బందులు కలిగించేలా రోడ్లపై మొక్కజొన్న నే కాదు మరి ఇతర పంటలను కూడా ఆరబెట్టకూడదు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తె లుసు. నిబంధనలు పాటించకుండా వా హన చోదకులకు ఇబ్బందుల గురిచేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
శేఖర్ రెడ్డి, ఎస్‌ఐ, మహమ్మదాబాద్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా