18-10-2025 12:31:44 PM
వెల్దుర్తి,(విజయక్రాంతి): వెల్దుర్తి మండల కేంద్రంలో బీసీ బందును టిఆర్ఎస్ మండల నాయకులు(BRS Mandal leaders) విజయవంతంగా వ్యాపార సంస్థల యజమానులతో స్వచ్ఛందంగా బందును పాటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంచాల్సిందేనని మండలంలో బి ఆర్ ఎస్ నేతలు ప్రధాన రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి సభ్యుడు రమేష్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కోదండ కృష్ణ గౌడ్, మండల రైతు నాయకుడు తోట నరసింహులు, లువురు నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ వస్తుందని, 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పుకుంటూ కాలయాపన చేసి తీరా ఇప్పుడు ప్రతిపక్షాల పైన రుద్దడం ఎంతవరకు సమంజసం అన్నారు.
రిజర్వేషన్ అని చెప్పినప్పుడు కోర్టులు వద్దంటాయా?అవునంటాయా? అని వారికి తెలియదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కనీసం ఆ మాత్రం అంచనాలు లేకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంటూ జీవోలు ఎలా జారీ చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో 42 శాతం రిజర్వేషన్ బిల్లును పొందుపరిచి రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు భూపాల్ రెడ్డి, రమేష్ గౌడ్, కృష్ణ గౌడ్, ప్రతాప్ రెడ్డి, నర్సింలు, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ గౌడ్, చల్ల మహేష్, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.