calender_icon.png 18 October, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బంద్.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తత

18-10-2025 01:33:27 PM

పోటాపోటీ నినాదాలు, పోలీసుల జోక్యంతో ప్రశాంతం

వలిగొండ, (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన బంద్(BC Bandh) ఫర్ జస్టిస్ వలిగొండ మండల కేంద్రంలో ఉద్రిక్తంగా మారింది. బంద్ సందర్భంగా ముందుగా కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ, బీసీ సంఘాలతో కలిసి రాస్తారోకో చేస్తుండగా బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాల వారు ఒక పార్టీపై మరొకరు బీసీ రిజర్వేషన్లకు అడ్డు అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే స్థానిక ఎస్.ఐ యుగంధర్ గౌడ్ ఇరు పార్టీల నాయకులకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగి రాస్తారోకో ప్రశాంతంగా కొనసాగింది.