18-10-2025 12:38:28 PM
రామచంద్రపురం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం
రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మెయిన్ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ బంద్‌కు(BC bandh) మద్దతుగా నిరసన కార్యక్రమం జరిగింది. బీసీ తరగతులకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ పిలుపునిచ్చిన ఈ బంద్‌కు పటాన్‌చెరు బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆదేశాల మేరకు, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య నేతృత్వంలో నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ బీఆర్‌ఎస్ నాయకులు కుమార్ గౌడ్, పరమేశ్ యాదవ్, చిన్న, రమేష్ యాదవ్, పాపయ్య, పటి సత్యనారాయణ, అప్పల భాస్కర్, చికురు శ్రీను, రవి, సంపత్ గౌడ్, రాజేశ్, కిరణ్ గౌడ్, గౌస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.