18-10-2025 12:24:51 PM
కరీంనగర్,(విజయక్రాంతి): 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని శనివారం నాటి బీసీ బంద్ నేపథ్యంలో కరీంనగర్లో( Karimnagar BC bandh) ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీపీఐ నాయకులు బంధులో పాల్గొని తెరిచి ఉన్న పలు హోటళ్లలో సామాన్లు, ప్లేట్లు పగలగొట్టి ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ లోని ప్రతిమ హోటల్ తో పాటు పలు హోటళ్లలో ఫర్నిచర్ ద్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో అక్కడినుండి వెళ్లిపోయారు. బంద్ కు ఎందుకు మద్దతివ్వదం లేదని ఎందుకు తెరిచారని నాయకులు ప్రశ్నించారు. అనంతరం హోటళ్లను మూసివేయించారు.