calender_icon.png 18 October, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో బంద్ ప్రశాంతం

18-10-2025 12:33:38 PM

  1. బీసీ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బిజెపి, బి.ఆర్.ఎస్,
  2. సిపిఎం బందుకు మద్దతు 
  3. డిపోలకే పరిమితమైన బస్సులు 
  4. దుకాణాలు బంద్, బందోబస్తు నిర్వహించిన పోలీసులు 

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో(Kamareddy District) బీసీ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన బందు పిలుపు ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం ఐదు గంటలకే బీసీ సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్, సిపిఎం, విద్యార్థి సంఘాలు నాయకులు బస్టాండ్ వద్దకు వచ్చి బస్సులు వెళ్లకుండా అడ్డుకొని ఆందోళన నిర్వహించారు. దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మండల కేంద్రాలు తోపాటు పటాన్ కేంద్రాలు జిల్లా కేంద్రంలో బీసీ సంఘాలు బందు పిలుపుకు వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించాయి.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి కొత్త బస్టాండ్ నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీసీ సంఘాల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి కదలలేదు. బయట నుంచి వచ్చిన బస్సులను బస్టాండ్ లోకి రాకుండా బీసీ సంఘాల నాయకులు అడ్డుకున్నారు.