18-10-2025 12:41:23 PM
కొమురవెల్లి,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్(BC Reservation)కు మద్దతుగా రాష్ట్రవ్యాప్త బంద్(BC Bandh)కు బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మండల వ్యాప్తంగా బీసీ సంఘాలనాయకులు తో పాటు వివిధ పార్టీల నాయకులు బంద్ ను నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండే వివిధ పార్టీలకు చెందిన నాయకులు బైకులపై తిరుగుతూ మండలంలోని వ్యాపార సంస్థలను, దుకాణాలను, హోటళ్లను పాఠశాలలను మూసి వేయించారు. బంద్ కారణంగా మల్లికార్జున స్వామి పుర వీధులు నిర్మానుష్యంగా మారాయి.బంద్ కు అన్ని వర్గాల వారు తమ షాపులను స్వచ్ఛందంగా బంద్ చేసికొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఈ బంద్ కార్యక్రమంలో కార్యక్రమంలో నాయకులు పబ్బొజు రాములు చారి, ముత్యం నరసింహులు, భీమనపల్లి కరుణాకర్, పడగన్న గారి మల్లేశం, మెరుగు కృష్ణ,ఎరుపుల మహేష్, గొల్లపల్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.