calender_icon.png 18 October, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగజ్ నగర్ లో బీసీ సంఘాల బంద్ విజయవంతం

18-10-2025 12:27:01 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చిన బంద్(BC bandh) పిలుపుమేరకు శనివారం  పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు ప్రైవేటు సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ విజయవంతం అయ్యేలా అన్ని పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించారు. బీసీ సంఘాల బంద్ కు తమ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, బిజెపి,బీఆర్ఎస్ , సిపిఐ, ఎంఐఎం పార్టీల నాయకులు వ్యాపారస్తులు బంద్ నిర్వహించాలని ప్రధాన రోడ్డుపై నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు.