18-10-2025 12:36:17 PM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): బీసీలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ... స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు బందును పాటించి బీసీలకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజలకు మోసం చేయకుండా 42 శాతం రిజర్వేషన్ అమలు చేసే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అమలు అయ్యేదాకా తమ పోరాటం ఆగదని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో టిఆర్ఎస్ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.