08-11-2025 12:00:00 AM
వ్యవసాయ అధికారి నవీన్..
వెంకటాపురం(నూగూరు), నవంబర్ 7(విజయ క్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోనీ మొక్కజొన్న విత్తనోత్పత్తి చేయదలుచుకున్న రైతులు ఆర్గనైజర్/ కంపెనీలతో ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతే రైతు లు మొక్కజొన్న సాగు చేయాలని వెంకటాపురం మండలం వ్యవసాయ అధికారి నవీన్ శుక్రవారం ఒక ప్రకటనలో రైతులకు తెలియజేశారు... గత సంవత్సరం మొక్కజొన్న విత్త నోత్పత్తి లో తలెత్తిన సమస్యలు అనుభవాల దృష్ట్యా రైతులు మోసపోకుండా ముందస్తుగా అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాతే మొక్కజొన్న పంట వేసుకోవాలని సూచించారు.... రైతులు కంపెనీ లేదా ఆర్గనైజర్ నుండి అగ్రిమెంట్ తీసుకోవడం తమ బాధ్యతగా భావించాలని సూచించారు.. రైతులు కంపెనీ లేదా ఆర్గనైజర్ నుండి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, అగ్రిమెంట్ మరియు బిల్లులు పంట కాలం పూర్తయిపోయే వరకు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని తెలిపారు.
పంట పెట్టుబడి కింద కంపెనీ లేదా ఆర్గనైజర్ ఇచ్చే డబ్బులు కేవలం బ్యాంక్ అకౌంట్ ద్వారానే జమ చేసుకోవాలని, నగదు రూపంలో తీసుకోవద్దని రైతులకి తెలియజేశారు... పంట వేసుకున్న తర్వాత కంపెనీ తరఫున ఫీల్ ఏజెంట్లు తప్పనిసరిగా పంటని తరచుగా పర్యవేక్షిస్తూ వ్యవసాయ పంటలో వచ్చే ఇబ్బందులని వ్యవసాయ శాఖ ద్వారా నివృత్తి చేసుకొని రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చి రైతులు అధిక దిగుబడులు పొందేలా చూడాలి అని అన్నారు.ఆర్గనైజర్లు సైతం రైతులకు అందించే ఎరువులు పురుగుమందులు అన్ని లైసెన్సుడు ఎరువులు, పురుగు మందుల దుకాణం నుంచి అందజేయాలని ఆర్గనైజర్లకి వ్యవసాయ అధికారి సూచించారు..... కంపెనీ గాని ఆర్గనైజర్లు గాని రైతులకి అగ్రిమెంట్ ఇవ్వకుండా మొక్కజొన్న సాగు చేయించి రైతులకి నష్టం కలిగిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు... ఈ విషయమై వ్యవసాయ శాఖ నుండి వచ్చే సలహాలు, సూచనలని రైతులు ఎప్పటికప్పుడు తప్పక పాటించాలని సూచించారు.