08-11-2025 04:56:00 PM
దౌల్తాబాద్: మండల పరిధిలోని పోసాన్ పల్లి గ్రామానికి చెందిన అబ్రబోయిన రాములు(50) బైక్‌పై వెళ్తుండగా కోనాయిపల్లి సమ్మక్క సారలమ్మ ఆలయం సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో రెండు కాళ్లు తీవ్రంగా గాయపడ్డాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది నర్సింలు, పైలట్ కుమార్ అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి రాములను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.