calender_icon.png 8 November, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..

08-11-2025 04:40:09 PM

ఉప్పల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఉప్పల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్వి కిట్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మల్లాపూర్ సూర్య నగర్ లో గణపతి ఆలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని దేవునికి ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు దంతూరి రాజు కప్పర సాయి ఉమేష్ గౌడ్ నెమలి అనిల్ రాజు గౌడ్ యాదగిరి అక్బర్ బాషా  పాల్గొన్నారు. 

నాచారంలో.. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా నాచారం సీనియర్ నాయకుడు వి ఎస్ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కేకు కట్ చేసి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాచారం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.