08-11-2025 12:00:00 AM
మొయినాబాద్, నవంబరు7 (విజయ క్రాంతి): ఓ కళాశాల బస్సును మరో బస్సు వెనకాల నుంచి ఢీకొనడంతో వెనకాల బస్సులో ఉన్న విద్యార్థులకు, డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ చౌరస్తాలోని హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ పరిధిలోనే ఉన్న ఎన్కేపల్లి రెవెన్యూలో ఉన్న జేబీఐటీఈ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు శుక్రవారం సాయంత్రం కళాశాల అయిపొగానే విద్యార్థులను ఎక్కించుకొని నగరంవైపు వెళ్తుండగా హిమాయత్ నగర్ చౌరస్తాకు రాగానే ప్రమాదవశాత్తు ముందు వెళ్తున్న మరో బస్సును ఢీకొనడంతో బస్సు అద్దాలు పూర్తిగా దగ్ధదమయ్యాయి.
ముందు వెళ్తున్న బస్సు ఆపకుండానే వెళ్లిపోయింది. అయితే వెనకాల నుంచి డీకొన్న బస్సులో విద్యార్థులకు, డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. విద్యార్థులను వేరె బస్సు రప్పించి నగరంలోని వారి ఇంటికి పంపించారు.
సాయంత్రం అయితే చాలు ఈ ప్రాంతం రద్దీగా ఉంటు ందని రోడ్డు దాటాలంటే భయపడాల్సిన పరిస్థితుల్లో బస్సులు తీవ్రమైన వేగంతో వెళ్తుంటాయని ప్రయాణికులు, స్థానికులు పేర్కొంటున్నారు. బారీ కేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.