calender_icon.png 8 November, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

08-11-2025 04:34:10 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేకు కోసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమంకోసం రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగళ్ళ వెంకటేశ్వర్లు, పువ్వాల మంగపతి, గాదె తిరపతి రెడ్డి, కరటూరి కృష్ణ, ఖాదర్ బాబా, శనగపాటి రవి, గణపతి, మిర్యాల అవినాష్, హరి, చిన్నా, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ దుగ్గి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన బాలుర వసతి గృహంలో సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించారు.