08-11-2025 04:31:37 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని వివేకానంద హై స్కూల్ వారు పిల్లలలో ఆధ్యాత్మికత, మహాభారతం రామాయణం వంటి ఇతిహాసాలపై అవగాహన నిమిత్తం యాదగిరిగుట్ట, సురేంద్రపురికి విహారయాత్రకు శనివారం తీసుకువెళ్లడం జరిగింది. ఈ విహారయాత్రలో మహాభారతం, రామాయణం, ఇతిహాసాల లోని గొప్పతనం గురించి పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, పాఠశాల కరస్పాండెంట్ భూసారపు రవీందర్, స్కూల్ ప్రిన్సిపల్ భూసారపు సుజాత, జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ పిన్నింటి రజిత, అధ్యాపక బృందం పలువురు పాల్గొన్నారు.